: సికింద్రాబాద్‌లోని శ్రీకర ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. రోగులను వదిలేసి పారిపోయిన సిబ్బంది


సికింద్రాబాద్‌లోని శ్రీకర ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. ప్రాణభయంతో  సిబ్బంది పరుగులు తీశారు. రోగుల ప్రాణాలను గాలికొదిలేసి పారిపోయిన సిబ్బందిపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News