: విశేషంగా ఆకట్టుకుంటున్న ఏపీ శాసనసభ భవన నమూనా.. ఐదెకరాల విస్తీర్ణం.. 50 అంతస్తుల ఎత్తు!
నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించ తలపెట్టిన శాసనసభ భవన నిర్మాణ ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటోంది. శాసనసభ భవనం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే ఒక నమూనా రూపొందించిన బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మరో రెండు డిజైన్లను సిద్ధం చేస్తోంది. వీటిలో ఉత్తమంగా ఉన్న దానిని సీఎం ఎంపిక చేస్తారు.
శాసనసభ డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌లు ఈనెల 27, 28 తేదీల్లో మరోమారు లండన్ వెళ్లనున్నారు. కాగా, నార్మన్‌ఫోస్టర్ సంస్థ ఇప్పటికే రూపొందించిన ఓ డిజైన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తం ఐదెకరాల్లో నాలుగు భవంతులు, వాటిపైన చతురస్రాకారపు కప్పు, దానిపై ఎత్తైన టవర్ ఉన్న ఈ ఆకృతి మంత్రమగ్ధులను చేస్తోంది. టవర్‌తో కలిపి భవనం ఎత్తు 530 అడుగులు అంటే దాదాపు 50 అంతస్తులంత ఎత్తు అన్నమాట!