: రిలయన్స్ జియో మరో సంచలనం.. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరణ!


సంచలన ఆఫర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టి అనతికాలంలో వినియోగదారుల ఆదరాభిమానాలు సంపాదించుకున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. మొబైల్ డేటా వినియోగాన్ని భారీగా పెంచేసిన జియో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది. అమెరికాలోని మొత్తం మొబైల్ నెట్‌వర్క్‌లపై వినియోగమవుతున్న డేటాను జియో చందాదారులు ఒక్కరే వినియోగిస్తున్నారు. ఇక జియో యూజర్స్ వినియోగిస్తున్న డేటా చైనాలో వినియోగమవుతున్న డేటా కంటే 50 శాతం ఎక్కువని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సోమవారం రాత్రి వివరాలు వెల్లడించింది.

భారత్ ఎంత వేగంగా డిజిటలైజేషన్ దిశగా పయనిస్తోందన్న విషయాన్ని తాజా గణాంకాలు చెబుతున్నాయని ఆర్ఐఎల్ పేర్కొంది. ప్రతి రోజు 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరించినట్టు తెలిపింది. ఇక మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోని ఇతర దేశాలకంటే భారత్ ఎంతో ముందుందని పేర్కొంది. కాగా, మార్చి 31 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 10.80 కోట్లకు చేరుకున్నట్టు వివరించింది.

  • Loading...

More Telugu News