: నంద్యాలపై చంద్రబాబు ఫుల్ ఫోకస్.. సుజనా, కాల్వలకు ఆదేశం
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండడంతో అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కర్నూలు జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జి మంత్రులుగా నియమితులైన కేంద్రమంత్రి సుజనా చౌదరి, కాల్వ శ్రీనివాసులను సీఎం ఆదేశించారు. సంస్థాగత ఎన్నికలపై సోమవారం రాత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై నిర్లక్ష్యం వహించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పర్యటించిన చదలవాడ కృష్ణమూర్తిపై సమీక్షలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో ఆయన నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు.