: భావితరాలకు ఆదర్శప్రాయుడు దర్శకుడు విశ్వనాథ్: సీఎం కేసీఆర్


భావితరాలకు ఆదర్శప్రాయుడు దర్శకుడు విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. 2016 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన విశ్వనాథ్ కు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకే గొప్ప గౌరవం తెచ్చిన విశ్వనాథ్, ఈ అవార్డును అందుకోవడానికి సంపూర్ణమైన అర్హత గల వ్యక్తి అని కొనియాడారు. భారతీయ సంగీత సంప్రదాయాలు, నృత్య కళకు అద్దంపట్టే చిత్రాలతో పాటు భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రాలనూ ఆయన రూపొందించారంటూ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News