: పన్నీర్ సెల్వంకు భద్రత పెంపు.. సీఆర్పీఎఫ్ కమాండోల రక్షణ


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు భద్రత పెంచారు. ఈ రోజు నుంచి సీఆర్పీఎఫ్ కు చెందిన కమాండోలు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చెన్నయ్, అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద పహారా కాస్తున్నారు. కాగా, ఈ నెల మొదట్లో పన్నీర్ కు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జయలలిత మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం వాహనంపై శశికళ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి పన్నీర్ వర్గం నేత మైత్రేయన్ తీసుకువెళ్లారు. దీంతో, పన్నీర్ కు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

  • Loading...

More Telugu News