: టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌.. పేలిపోయిన టైరు


ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో ఓ ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో పాటు ఓ టైరు పేలిపోయిన ఘ‌ట‌న కేరళలోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా విమానం దారితప్పి రన్‌ వేపై సెంట్రల్‌ లైన్‌ నుంచి ఎడమ వైపుకు 30 మీటర్ల దూరం వెళ్లింది. ఆ స‌మ‌యంలో విమానంలో సిబ్బందితో పాటు 191 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ ఎటువంటి గాయాలు కాలేద‌ని చెప్పారు. పైలట్‌ చాకచక్యంగా విమానాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కొద్దిసేపు ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ లోనే వసతి కల్పించామని అన్నారు. వారిని మరో విమానంలో పంపించినట్లు తెలిపారు.
 

  • Loading...

More Telugu News