: ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా: సోము వీర్రాజు


ఏపీలో మూడేళ్ల నుంచి యథేచ్ఛగా ఇసుక దందా సాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ రోజు జరిగిన బూత్ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికార బలంతో నేతలు అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సిమెంట్ ధర అధికంగా ఉందని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఓ కమిటీ ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ కమిటీని పక్కనపెట్టి, సిమెంట్ యాజమాన్యాలతో సీఎం నేరుగా చర్చించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News