: భారతీయులు అదృష్టవంతులు...!: 'కళాతపస్వి'కి పురస్కారంపై కమలహాసన్ స్పందన


కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంపై విలక్షణ నటుడు కమలహాసన్ తనదైన శైలిలో సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ‘నా కె.విశ్వనాథ్ గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్. ఈ అవార్డు దక్కించుకున్న ఆయన నిగర్వంగా ఏం చెబుతారంటే ‘నేను అదృష్టవంతుడిని’ అని. సత్యం ఏంటంటే.. భారతీయులు అదృష్టవంతులు...సంతోషం నిండిన కళ్లతో చెబుతున్నా.. సాగరసంగమం చిత్రంలో ‘బాలు’ పాత్ర ఇచ్చి.. మరిన్ని ప్రశంసలు పొందేలా చేసిన విశ్వనాథ్ గారు థ్యాంక్యూ. మీ కీర్తి నాది.. అలానే, నా కీర్తి మీది’ అని కమల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News