: మా తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయి: కె.విశ్వనాథ్


ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కె. విశ్వనాథ్ మాట్లాడుతూ, ఈ పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, తన తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయని, తనను ఆదరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. దేశ సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డును భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News