: తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణం: ‘విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే’పై మురళీమోహన్
ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు 2016 సంవత్సరానికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన అంశంపై టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్‌కు ఈ అవార్డు రావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణమని, ఇది తెలుగు సినిమా రంగానికి ఇచ్చిన గౌరవమని సినీనటుడు, ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి విశ్వనాథ్ 100 శాతం అర్హుడని వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో మరచిపోలేని సినిమాలను ఆయన అందించారని ప్రశంసించారు.