: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏసియా
విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పన్నులన్నింటినీ కలుపుకుని రూ. 1099కి టికెట్ ప్రారంభ ధరను ప్రటించింది. ఈ నెల 30లోగా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 5 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 మధ్య ప్రయాణించే వారు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, గోవా, విశాఖపట్నం, పూణె మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.