: అందుకే నన్ను సినిమాల్లో నటించడానికి పంపుతున్నారేమో!: సూర్య గురించి నటి జ్యోతిక


తన భర్త సూర్య తన కారు దగ్గరకు వచ్చి మరీ ప్రతి రోజూ బాయ్‌ చెప్తారని, ఆ త‌రువాతే ఆయ‌న‌ సినిమా షూటింగ్‌కు బయలుదేరుతారని సినీ న‌టి జ్యోతిక చెప్పింది. జ్యోతిక న‌టిస్తోన్న‌ ‘మగాలిర్‌ మట్టం’ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని ఈ రోజు ఉద‌యం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సూర్య కూడా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా జ్యోతిక మాట్లాడుతూ త‌న శ్రీ‌వారి గురించి ప‌లు ర‌హ‌స్యాలు చెప్పింది. త‌న‌కు పెళ్లి అయి పదేళ్లవుతోందని, ఇన్నేళ్ల‌లో త‌న‌ భర్త కోసం స్వయంగా కేవలం ఒక్క దోశ మాత్ర‌మే వేశానని తెలిపింది. కాక‌పోతే తాను వేసిన ఆ దోశ చపాతీలా వ‌చ్చింద‌ని చెప్పి అందర్నీ నవ్వించింది.

ఆ దోశ తిన్నందుకు త‌న శ్రీ‌వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు జ్యోతిక పేర్కొంది. ఆ దోశను తాను త‌మ‌ పెళ్లి తర్వాతి రోజు వేశానని చెప్పింది. ఇక తాను కాఫీ పెట్టి ఇస్తానని చెబితే సూర్య అక్కడి నుంచి పరుగు తీస్తారని ఆమె తెలిపింది. అసలు అందుకే త‌న‌ను ఇంకా సినిమాల్లో నటించడానికి పంపుతున్నారేమో అనిపిస్తుందని తన పాకశాస్త్ర ప్రావీణ్యంపై తానే జోక్ వేసుకుంది. అయితే, ఒకవేళ సూర్య త‌న జీవితంలో లేక‌పోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని తెలిపింది.

  • Loading...

More Telugu News