: కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించిన ట్రావెల్స్ ఉద్యోగులు
చెప్పాపెట్టకుండా ట్రావెల్స్ ను మూసేని, తమకు జీతాలు కూడా చెల్లించకుండా బాధ పెడుతున్నారని ఆరోపిస్తూ కేశానేని ట్రావెల్స్ ఉద్యోగులు ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యామని... తమకు ఇంకా అన్యాయం చేయవద్దని వారు విన్నవించారు. ఏపీ తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని నాని కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కార్మికశాఖ కమిషనర్ ను కలిశారు. జీతాలు చెల్లించమని తాము అడిగితే, తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.