: 16.66 శాతం హిందువుని, 16.66 శాతం ముస్లింని...: ఆసక్తిరేపుతున్న బాలీవుడ్ నటుడి వీడియో
ఇటీవల తాను డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నానని, అందులో తాను ఏ మతానికి చెందినవాడినో తెలిసిందంటూ బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖి ఓ వీడియోను విడుదల చేసి ఆకట్టుకున్నాడు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని తాను 16.66 శాతం హిందువుని అని ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు, మిగతా మతాల పేర్లను ప్రస్తావిస్తూ 16.66 శాతం ముస్లిం, 16.66 శాతం క్రిస్టియన్, 16.66 శాతం సిక్కు, 16.66 శాతం బుద్ధిస్ట్‌నని చెప్పాడు. అయితే, తన మనస్సాక్షి మాత్రం తనని 100 శాతం ఆర్టిస్ట్‌నని చెబుతోందని ఆయన అన్నాడు. అన్ని మతాలు కలిస్తేనే తాను 100 శాతం కళాకారుడిని అయ్యానని సందేశాన్నిచ్చాడు. మతాల గురించి చెబుతున్నప్పుడు ఆయా మతాల వారు ధరించే దుస్తులను ధరించి ఈ వీడియోలో కనిపించాడు.