: బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా స్టాకుల మద్దతుతో రంకె వేసిన బుల్
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా స్టాకుల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో... మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 290 పాయింట్లు పెరిగి 29,655 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 9,217కి చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఇండియన్ బ్యాంక్ (9.29%), ఏసీసీ (7.36%), ఇండియా సిమెంట్స్ (7.05%), హ్యాత్ వే కేబుల్స్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ (6.92%), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (6.48%).
టాప్ లూజర్స్...
డిష్ టీవీ ఇండియా (-5.60%), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.88%), అజంతా ఫార్మా (-4.35%), లుపిన్ లిమిటెడ్ (-3.33%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-3.02%)