: నకిలీ బంగారం కేసులో 72 మందికి జైలు శిక్ష
గుంటూరు జిల్లాలో నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం పొందిన 72 మందికి ఈ రోజు శిక్ష విధిస్తూ రేపల్లె అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. వారంతా 2009లో భట్టిప్రోలులోని ఆంధ్రా బ్యాంకును మోసగించి రుణాలు పొందారని కోర్టు స్పష్టం చేసింది. 72 మందికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులపై 2010లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విధంగా తీర్పునిచ్చింది.