: ఈ రోజు పసిడి ధరలు తగ్గాయి!
పసిడి ధరలు తగ్గాయి. ఈ రోజు ట్రేడింగ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350 తగ్గి రూ.29,650కు చేరింది. అదే విధంగా, వెండి ధర కూడా రూ.100 తగ్గింది. కిలో వెండి రూ.41,600కు చేరింది. ఈ సందర్భంగా బులియన్ ట్రేడింగ్ వర్గాలు మాట్లాడుతూ, అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు మందగించడం వల్ల బంగారం ధరలు, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధరలు తగ్గినట్టు చెప్పారు. కాగా, గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. మార్చి 2వ తేదీ తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధర 1.5 శాతం తగ్గడం గమనార్హం.