: ఛోటా రాజన్ ను దోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
నకిలీ పాస్ పోర్టు కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ కు ఎదురుదెబ్బ తగిలింది. రాజన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. రేపు శిక్షను ఖరారు చేయనుంది. మారు పేరుతో, ఫోర్జరీ పత్రాలతో ఛోటా రాజన్ నకిలీ పాస్ పోర్టు పొందినట్టు గత ఏడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్ తో పాటు పాస్ పోర్టు అధికారులు దీపక్ నట్వర్ లాల్ షా, లలిత లక్ష్మణన్, జయశ్రీ దత్తాత్రేయ్ రహతెలపై కేసు నమోదైంది. రాజన్ కు వీరు సహకరించారంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గుర్నీ కూడా సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది.