: కర్ణాటక ముఖ్యమంత్రికి తప్పిన పెను ప్రమాదం


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధరామయ్య బయల్దేరారు. హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే దాన్ని పక్షి ఢీకొంది. వెంటనే హెలికాప్టర్ ను బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి క్షేమంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ కు ఏమీ కాలేదని నిర్ధారించుకున్న తర్వాత వీరంతా మళ్లీ అదే హెలికాప్టర్ లో శ్రావణబెళగలకు బయల్దేరారు. 

  • Loading...

More Telugu News