: విజయవాడలో ‘కేశినేని’ ఉద్యోగుల ధర్నా
విజయవాడలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమకు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ‘కేశినేని’ యాజమాన్యంపై కేసు పెట్టాలని కోరుతూ కార్మిక శాఖ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. తమకు బకాయిపడ్డ జీతాలు అడిగినందుకు ఎంపీ కార్యాలయంలో సమావేశమంటూ పిలిచి దాడి చేశారని కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఆరోపించారు.