: రాజధాని ప్రాంతంలోని పెనుమాక భూసేకరణపై స్టేటస్ కో విధించిన హైకోర్టు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున భూ సేకరణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో పెనుమాక గ్రామ పరిధిలోని భూసేకరణ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని... రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకు సాగాలని... అంతవరకు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాల భూమిని సేకరించడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, భూములను ఇచ్చేందుకు ఇష్టపడని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.