: మహిళా డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తా: షారూక్ ఖాన్


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాను కలసి పని చేసిన మహిళా డైరెక్టర్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. తాను, చాలా కొద్ది మంది మహిళా దర్శకులతో కలిసి పని చేశానని, వారితో కలిసి పని చేస్తున్నప్పుడు తాను చాలా ఎంజాయ్ చేస్తానని అన్నాడు. వారి పని తీరు, వారితో కలిసి పనిచేయడం గురించి షారూక్ మాట్లాడుతూ, ఫరాఖాన్ కమర్షియల్ డైరెక్టర్ కాగా, గౌరీ షిండే అందుకు పూర్తిగా భిన్నమైన డైరెక్టర్ అని, భారీ సినిమాలు, సరదాగా ఉండే సినిమాలు చేయాలని ఫరాఖాన్ అనుకుంటుందని, గౌరీ షిండే మాత్రం వ్యక్తుల స్వభావాలను చూపే దర్శకురాలని షారూక్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఫరాఖాన్ దర్శకత్వంలో ‘మై హునా’, ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూఇయర్’ చిత్రాల్లో నటించాడు. గౌరీ షిండే దర్శకత్వంలో ‘డియర్ జిందగీ’ చిత్రంలో నటించాడు.

  • Loading...

More Telugu News