: 'ఈ నేల ర‌జ‌నీకాంత్‌ను న‌మ్మి ఉంది.. ప్రజలకు దారి చూపించాలి' అంటూ తమిళనాడులో మళ్లీ వెలసిన పోస్టర్లు


తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సినీన‌టుడు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల కాస్త త‌గ్గిన‌ చ‌ర్చ తాజాగా మ‌రోసారి పెద్ద ఎత్తున జ‌రిగేలా రజనీకాంత్‌ నివాసం పొయిస్‌ గార్డెన్‌ సమీపంలోని రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్‌ వద్ద ప‌లు పోస్ట‌ర్లు వెలిశాయి. ఈ నేల ర‌జ‌నీకాంత్‌ను న‌మ్మి ఉంద‌ని, దాన్ని పాలించ‌డానికి ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని, ప్రజలకు దారి చూపించాలని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్ల‌పై ర‌జ‌నీకాంత్ స్పందిస్తారా? లేదా? అన్న అంశంపై కూడా ఆస‌క్తి నెల‌కొంది. గ‌తంలోనూ ర‌జనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే, రజనీ కాంత్ మాత్రం ‘పై వాడు ఎలా శాసిస్తే అలా జరుగుతుంది’ అంటూ మాత్రమే సమాధానం ఇస్తున్నారు. 

  • Loading...

More Telugu News