: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. రెచ్చిపోయిన విద్యార్థి గ్రూపులు
జమ్ముకశ్మీర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అక్కడి కళాశాలలను తిరిగి ప్రారంభిస్తున్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో అక్కడి పలు విద్యార్థి గ్రూపులు రెచ్చిపోయాయి. గుంపులుగా నిరసన ప్రదర్శనలతో రోడ్లపైకి వచ్చి కలకలం రేపాయి. అదుపు చేయడానికి వచ్చిన భద్రతాబలగాలపై రాళ్లు రువ్వాయి. దీంతో భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరపవలసి వచ్చింది. పలు విద్యా సంస్థల ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా ప్రయత్నిస్తున్నాయి.