: తెలుగుదేశం ఈ ఏటి మహానాడు వేదిక ఖరారు!


ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు, మహానాడుకు వేదిక ఖరారైంది. వచ్చే నెల 27 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో మహానాడును వైభవంగా నిర్వహించనున్నట్టు టీడీపీ వెల్లడించింది. ఈ సమావేశాలకు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కూడిన 20 వేల మందికి పైగా పాల్గొంటారని, అందరికీ వసతి, భోజన ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేసింది. దివంగత ఎన్టీ రామారావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతామని, ఆపై పలు తీర్మానాలను ఈ సమావేశాల్లో ఆమోదిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News