: నారా లోకేష్ నోరు జారాడనేది పచ్చి అబద్ధం.. అనవసరంగా రాద్ధాంతం చేశారు.. వీడియో మీరూ చూడండి
ఏపీ మంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి నారా లోకేష్ పై విపక్ష నేతల సెటైర్లు ఎక్కువయ్యాయి. తన ప్రసంగాల్లో అప్పుడప్పుడు లోకేష్ తడబడుతుండటాన్ని వైరిపక్షాల నేతలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వీటికి సంబంధించిన కామెంట్లు భారీ ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మొత్తం 225 స్థానాలకు గాను 200 స్థానాల్లో టీడీపీని గెలిపించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే, నియోజకవర్గాల పెంపు చేపడితే... ఈ స్థానాల సంఖ్య 225కు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే, 225 స్థానాలకు గాను 200 స్థానాల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
వాస్తవానికి లోకేష్ అన్న మాటల్లోని ఉద్దేశం వేరు. దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయిన విపక్ష నేతలు, వారి అనుచరులు, అభిమానులు... లోకేష్ పై బురద చల్లడం ప్రారంభించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 200 నుంచి 225 స్థానాల్లో గెలిపించాలంటూ పిలుపునిచ్చిన లోకేష్... తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించారు.
వాస్తవానికి... లోకేష్ అన్నది ఒకటి... బయట ప్రచారం జరిగింది మరొకటి. ఈ వీడియోను చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది.
https://youtu.be/E5matM0wEdQ