: తన రెండో భర్తకు బిడ్డను కనివ్వాలని కోడలిని హింసించిన అత్త, మద్దతిచ్చిన మొగుడు... హైదరాబాద్ లో దుర్మార్గం!


దేశవ్యాప్తంగా 'ట్రిపుల్ తలాక్'పై చర్చ సాగుతున్న వేళ, వివాహం చేసుకుని, ఆపై ఘోర అవమానానికి గురై, 'తలాక్'తో భర్తకు దూరమైన మరో అభాగిని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు సుమానియా షర్ఫీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె భర్త ఓవైసీ తాలిబ్ పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 ఆర్/డబ్ల్యూల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా సుమానియా మాట్లాడుతూ, తనకు 2015లో వివాహమైందని, ఓ నెల రోజుల పాటు దుబాయ్ లో ఉండి వచ్చిన తరువాత తన కష్టాలు మొదలయ్యాయని వాపోయింది. తన భర్తకు గార్డియన్ గా, అత్త స్థానంలో ఉన్న మహిళ, తన రెండో భర్తకు బిడ్డను కనివ్వాలని హింసించిందని, అందుకు భర్త కూడా మద్దతిచ్చాడని పేర్కొంది. సరిగ్గా తిండి కూడా పెట్టేవారు కాదని, ఓ దశలో గదిలో బంధించి లైంగికంగా వేధించారని తన గోడును వెళ్లబోసుకుంది. ఆపై వాట్స్ యాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవాలని ప్రయత్నించారని వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News