: అమ్మానాన్నలకు ప్రామిస్ చేశా.. ఇచ్చిన మాట తప్పను!: తమన్నా
సినిమాల్లో హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షోపై నటి తమన్నా తనదైన శైలిలో స్పందించింది. హీరోయిన్లు బికినీలు వేసుకుంటేనే ప్రేక్షకులు ఆకర్షితులవుతారనే విషయాన్ని తాను నమ్మనని ఆమె స్పష్టం చేసింది. అదంతా కేవలం అపోహ మాత్రమే అని చెప్పింది. వేసుకునే దుస్తులు మనకు పేరు తీసుకురావని తెలిపింది. సౌకర్యంగా లేని దుస్తులను తాను ధరించలేనని తమన్నా చెప్పింది. సినీ పరిశ్రమలోకి రాకముందు తన తల్లిదండ్రులకు కొన్ని ప్రామిస్ లు చేశానని... ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాటను తప్పనని తెలిపింది. ప్రేక్షకులను ఆకర్షించడానికి తాను బికినీ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.