: సుఖేష్ బుట్టలో చాలా సులభంగా పడిపోయిన దినకరన్!


అన్నాడీఎంకీ గుర్తు రెండాకుల కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణను ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖరన్ అనే వ్యక్తి దినకరన్ ను చాలా తేలికగా బుట్టలో వేసుకున్నాడు. పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడైంది. సుఖేష్ తనను తాను హైకోర్టు జడ్జిగా దినకరన్ కు పరిచయం చేసుకున్నాడు. ఈ విషయాన్ని దినకరన్ గుడ్డిగా నమ్మేశాడు. అంతేకాదు, రెండాకుల గుర్తును సొంతం చేసుకోవడానికి ఎన్నికల అధికారులకు లంచం ఇవ్వడానికి ఇతనే సరైన వ్యక్తి అని నమ్మాడు.

ఏప్రిల్ 16న సుఖేష్ అరెస్ట్ కావడానికి సరిగ్గా 20 గంటల ముందు అతనికి దినకరన్ ఫోన్ చేశాడు. డీల్ మాట్లాడి, కొంచెం క్యాష్ ఇచ్చాడు. ఆ తర్వాత సుఖేష్ పోలీసులకు పట్టుబడటం... ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వాలనుకున్నారన్న వార్త వెలుగులోకి రావడం... యావత్ దేశం నివ్వెరపోవడం జరిగింది. నిన్న రాత్రి ఒంటి గంట వరకు కూడా వీరి విచారణ కొనసాగుతూనే ఉంది.  

  • Loading...

More Telugu News