: కర్ణాటకలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడి వీరంగం!


హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు కర్ణాటకలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్నే ఆపుతారా? అంటూ, టోల్ గేటు సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్ లో తన అనుచరులకు విషయం చెప్పి, వారిని పిలిపించి ఆపై దాడికి దిగారు. టోల్ గేటులోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు, ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్ గేటు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News