: షూటింగ్ కోసం వచ్చి... మిత్రుడు రేపల్లె ఎమ్మెల్యేను కలసిన జగపతిబాబు!


ఓ చిత్రం షూటింగ్‌ నిమిత్తం వచ్చి రేపల్లెలో బస చేసిన నటుడు జగపతి బాబు తన మిత్రుడైన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. కృష్ణా జిల్లా హంసలదీవిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, రేపల్లెలోని ఓ హోటల్ లో బసచేసి, అక్కడి నుంచే షూటింగ్ కు వెళుతున్నారు. ఎమ్మెల్యే అనగాని తన చిన్ననాటి మిత్రుడు కావటంతో ఆయనను స్వయంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా కుశల ప్రశ్నల నుంచి ప్రస్తుత రాజకీయాల వరకూ చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఆపై జగపతిబాబు మాట్లాడుతూ, తాను నాలుగు రోజుల పాటు రేపల్లెలోనే ఉంటానని తెలిపారు. తీరప్రాంతమైన రేపల్లెలో నిజాంపట్నం హార్బర్‌, పెనుమూడి, లంకెవానిదిబ్బ, నక్షత్రనగర్‌, దిండి తదితర ప్రాంతాలు సినిమాల చిత్రీకరణకు అనుకూలమని, అక్కడ పలు లొకేషన్స్ ఉన్నాయని, షూటింగ్ కు వస్తే, అన్ని రకాల సహాయాన్నీ అందిస్తామని ఈ సందర్భంగా అనగాని సూచించారు. తమ ప్రాంతంలోనూ షూటింగ్ లను ఏర్పాటు చేసుకోవాలని జగపతిబాబును ఆయన కోరారు.

  • Loading...

More Telugu News