: టాప్ లెస్ గా నటించడానికి సిద్ధమన్న తమిళ నటి


బాలీవుడ్ లో కొందరు నటీమణులు ఇప్పటికే టాప్ లెస్ గా కనిపించి, సంచలనం రేకెత్తించారు. అయితే, దక్షిణాదిలో మాత్రం ఇంకా ఇలాంటి సంస్కృతి రాలేదనే చెప్పాలి. కానీ, ఇప్పుడు టాప్ లెస్ గా నటించేందుకు తాను సిద్ధమంటూ తమిళ నటి సుజా వరూణి బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు దాదాపు 50 చిత్రాల్లో నటించింది. అయితే, వీటిలో ఎక్కువ శాతం ఐటెం సాంగులు, అతిథి పాత్రలే ఉన్నాయి. దీంతో, విరక్తి చెందిన ఆమె... ఇకపై ఐటెం సాంగ్స్ లో చిందేయనని తేల్చి చెప్పింది. కథ ప్రాముఖ్యతను బట్టి టాప్ లెస్ గా నటించేందుకు తాను సిద్ధమని... ఆ ధైర్యం తనకు ఉందని తెలిపింది. అయితే అనవసర సన్నివేశాల్లో కూడా అందాలు ఆరబోయమంటే మాత్రం తాను కుదరదని చెబుతానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.  

  • Loading...

More Telugu News