: కడప జిల్లాలో బస్సు బోల్తా.. 22 మంది విద్యార్థులకు గాయాలు
కడప జిల్లాలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కాశీనాయన మండలం వంకమర్రి బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. వేంపల్లె నుంచి గుడివాడకు విద్యార్థులు తమ తల్లదండ్రులతో కలసి వెళుతున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న ఇందు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. వీరంతా కేకే గౌతమ్ స్కూల్ కు వెళుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వారిని కడప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.