: మరోసారి ఇలా చేయబోము: అభిమానులను వేడుకున్న కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసిన విరాట్ కోహ్లీ, మరోసారి ఇంత చెత్త ప్రదర్శన చేయబోమని హామీ ఇచ్చాడు. తమ జట్టు అత్యుత్తమమైనదని, గతంలో 200 పైగానే స్కోరును సాధించామని గుర్తు చేసిన కోహ్లీ, తమ జట్టు 49 పరుగులకే కుప్పకూలడానికి నిర్లక్ష్యపు బ్యాటింగే కారణమన్నాడు. అత్యంత దారుణమైన ప్రదర్శనను చూపించామని, తమ ఓటమిపై మాట్లాడేందుకు ఇంతకన్నా మాటలు రావడం లేదని అన్నాడు.
ఈ ఓటమి తమకెంతో షాక్ ను కలిగించిందని, దాన్నుంచి బయటపడి తిరిగి సత్తా చాటుతామని, ఈ సమయంలో అభిమానులు అండగా నిలవాలని వేడుకున్నాడు. కాగా, ఐపీఎల్ ప్రస్తుత సీజనులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 మ్యాచ్ లను ఆడగా, కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గి, మిగతా మ్యాచ్ లలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఇప్పుడు ఆర్సీబీదే కింద నుంచి మొదటి స్థానం.