: మోదీని పొగిడి.. యోగిని ప్రశ్నించిన ముషారఫ్!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మోదీని ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీ చురుకైన నేత అని ప్రశంసించారు. భారత్‌లో అధికారంలో ఉన్నది మతతత్వ పార్టీ అని పేర్కొన్న ఆయన, మోదీ నాయకత్వంలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు. అయితే మోదీ శాంతిని కోరుకోవడం లేదని, అది పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు మోదీని పొగిడిన ముషారఫ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఆయనకున్న యోగ్యత ఏమిటని ప్రశ్నించారు. భారత్‌లో లౌకిక విశ్వాసాలు క్షీణిస్తున్నాయని చెప్పిన ముషారఫ్, భారత్‌తో పోలిస్తే పాక్ ఎంతో పురోగతి సాధించిందని, వివేకం కలిగిన సమాజం పాక్‌లో ఉందని పేర్కొన్నారు.