: అమెరికాలో సౌదీ రాయబారిగా ఆ దేశ రాకుమారుడు ఖలీద్
అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిగా రాకుమారుడు ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ నియమితులయ్యారు. అమెరికాకు రాయబారిగా ఉన్న ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫైజల్ బిన్ టుర్కీని తొలగించిన రాజు సల్మాన్ అతని స్థానంలో తన కుమారుడిని నియమించినట్టు సౌదీ అధికారిక వార్త ఏజెన్సీ ప్రకటించింది. అలాగే సైన్యానికి కూడా కొత్త అధిపతిని నియమించినట్టు పేర్కొంది.
ఇప్పటి వరకు ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా పనిచేసిన ప్రిన్స్ ఖలీద్.. ఐసిస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన సంకీర్ణ సేనల యుద్ధవిమానాలకు పైలట్‌గా పనిచేశారు. సౌదీ రాజు మరో కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్నారు. కేబినెట్లో జరిగిన మార్పుల కారణంగానే అబ్దుల్లా స్థానంలో ఖలీద్‌ను అమెరికా రాయబారిగా నియమించినట్టు తెలుస్తోంది.