: కళాసేవ కోసం సినీ రంగానికి ఎవరూ రారు: నటుడు గిరిబాబు


కళా సేవ కోసం సినీ రంగానికి ఎవరూ రారని, పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, బాగా సంపాదించడం కోసమే వస్తారని సీనియర్ నటుడు గిరిబాబు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పేరు, డబ్బే కదా ఏ మనిషి అయినా కోరుకునేది. సినీ రంగంలోకి ఎవరొచ్చినా వీటి కోసమే వస్తారు తప్పా, కళారాధన కోసమో, కళాసేవ కోసమో, ప్రజాసేవ కోసమో ఎవరూ రారు. ఆ విధంగా ఎవరైనా చెబితే అది శుద్ధ అబద్ధం. జానపద చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు నిర్మించాలని ఉంది. ఒక జానపద చిత్రమో లేక కౌబాయ్ చిత్రమో చేయాలని ఉంది. నాకు కత్తులు, గుర్రాలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి ‘చందమామ’ బాగా చదివేవాడిని...నాడు జానపద సినిమా తీయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పటి సినిమాలకు అయితే, ఆ అవసరం లేదు. ఎందుకంటే, గ్రాఫిక్స్ వచ్చేశాయి’ అని అన్నారు.

  • Loading...

More Telugu News