: ఏర్పేడు ఘటన చాలా దురదృష్టకరం: సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, లారీ క్లీనర్ మద్యం తాగి నడపడమే ఈ ప్రమాదానికి కారణమని అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విచారణ జరిపిస్తామని చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత అందరిపై చర్యలు తప్పవని అన్నారు.
టీడీపీ నాయకులు ధనుంజయలనాయుడు, చిరంజీవులు నాయుడును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వారిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించామని, తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తున్నామని అన్నారు. ఇసుకను వేరే ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోమని, ఎంత పెద్ద నేతలు ఉన్నా అరెస్టు చేయిస్తామని చంద్రబాబు చెప్పారు.