: ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. కొత్త నటులు ఆకాశం వైపు చూస్తున్నారు: గిరిబాబు


కొత్త నటుల సినిమా ఒక్కటి హిట్ అయితే చాలు, వాళ్లు ఆకాశం వైపు చూస్తున్నారని సీనియర్ నటుడు గిరిబాబు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కొత్త నటుల సినిమా ఒక్కటి హిట్ అవగానే, వారి పక్క నుండే వ్యక్తులు చెప్పే మాటలు వింటున్నారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని లేనిపోనివి నేర్పిస్తున్నారు. కార్వాన్ అడుగు, బయట కూర్చోవద్దు, వాళ్లతో కూర్చోవద్దు.. ఎక్కువగా మాట్లాడొద్దు..ఈ విధంగా పలువురు చెప్పే మాటలు విని అమాయక నటులు మోసపోతున్నారు.

దాంతో రెండో సినిమాలో నటించే అవకాశం కూడా వారికి ఉండట్లేదు. రెండు, మూడు సినిమాల్లో నటించిన తర్వాత.. ఆ నటులే కథ చెప్పడం, మార్చడం, డిమాండు చేయడం మొదలుపెడుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో, పొగరుతో, మేం పెద్ద హీరోలమైపోయాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో.. పక్కవాళ్లు చెప్పే మాటలు నమ్మి.. తమ జీవితాలను కొత్త నటులు చేతులారా పాడు చేసుకుంటున్నారు’ అని గిరిబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News