: ముద్రగడ స్వార్థపరుడు..ఆయనకు రహస్య అజెండా ఉంది: బోండా ఉమ


కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ముద్రగడ స్వార్థపరుడు. ఆయనకు రహస్య అజెండా ఉంది. కాపులకు ముద్రగడ ఏం చేశారు? కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నా ఆయన అర్థం చేసుకోవడం లేదు. మంజునాథ కమిషన్ ను ముద్రగడ ఎందుకు కలవలేదు? ముద్రగడ టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News