: విద్యాసాగర్ రావును పరామర్శించిన హరీశ్ రావు
తీవ్ర అస్వస్థతకు గురైన తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావును మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. విద్యాసాగర్ రావుకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి హరీశ్ వెళ్లారు. విద్యాసాగర్ రావు ఆరోగ్యం పై ఆయన కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, విద్యాసాగర్ రావు కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్నారు. గతంలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.