: హాలీవుడ్ నటి ఎరిన్ మోరాన్ కన్నుమూత!
ప్రముఖ హాలీవుడ్ నటి ఎరిన్ మోరాన్ (56) మృతి చెందారు. ఆమె నిన్న మధ్యాహ్నం మృతి చెందినట్టు ఇండియానా పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిన్న సాయంత్రం తమకు 911 నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని.. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి వెళ్లామని.. మృతి చెందిన వ్యక్తిని ఎరిన్ మోర్గాన్ గా నిర్ధారించామని తెలిపారు. కాగా, 1974లో ప్రఖ్యాతి గాంచిన టెలివిజన్ డ్రామా సిరీస్ ‘హ్యాపీడేస్’లో జోనీ కనిగ్హమ్ పాత్రను ఎరిన్ పోషించింది. ఈ పాత్ర ద్వారా ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇలా ఉండగా, తమ సహనటి మరణవార్తతో నటులు రాన్ హోవర్డ్, హెన్నీ విన్క్లర్, డాన్ మోస్ట్త తదితరులు తమ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.