: రాష్ట్రాలను చూసి నేర్చుకోవడానికి కేంద్ర సిద్ధం: మోదీ
రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మంచి విధానాలను కేంద్ర ప్రభుత్వం నేర్చుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించే అంశంపై చర్చించాలని అన్నారు. అన్ని రాష్ట్రాలు దీని గురించి ఆలోంచించాలని చెప్పారు. ముఖ్యమంత్రులు అందరికీ తాము పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జవదేకర్ లు హాజరయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా హాజరయ్యారు.