: జాతీయ అవార్డులపై విమర్శలు గుప్పించిన వర్మ
64వ జాతీయ చలనచిత్ర అవార్డులపై నెలకొన్న అసంతృప్తి జ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యూరీ సభ్యులు కొందరి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కూడా ఈ అవార్డులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మురుగదాస్ వ్యాఖ్యలపై అవార్డుల జ్యూరీ మెంబర్స్ కమిటీ హెడ్ ప్రియదర్శన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీన్ లోకి ఎంటరై హీట్ ను మరింత పెంచాడు. మన దేశంలో ఉన్న గొప్ప ఫిలిం మేకర్లలో అమీర్ ఖాన్ ఒకడని... ఆయనకు అవార్డులు రానంత మాత్రాన ఆయన స్థాయి తగ్గిపోదని అన్నాడు. అమీర్ ప్రతిభను అవార్డుల కమిటీ నిర్ణయంతో కొలవలేమని చెప్పాడు. అసలు ఏ అవార్డుల ఫంక్షన్లకు అమీర్ ఖాన్ హాజరు కాడని అన్నాడు.