: ‘బాహుబలి-2’లో రాజమౌళి, కీరవాణి కుమార్తెలు!


ఈ నెల 28న విడుదల కానున్న ‘బాహుబలి-2’ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేమింటే .. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిల కుమార్తెలు ఈ చిత్రంలో కనిపించడం. నిన్న ‘సాహోరే బాహుబలి’ వీడియో ప్రోమో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో, రాజమౌళి కుమార్తె మయూఖ, కీరవాణి కుమార్తె కుముద్వతి, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కుమార్తె అనన్య, కెమెరామెన్ సెంథిల్ తనయులు రేయాన్, ధృవలు ఉన్నారు. ప్రభాస్ మహారాజుగా వస్తున్న సందర్భంలో పూలు చల్లుతూ వీళ్లందరూ కనిపించారు.

  • Loading...

More Telugu News