: నేను ఈ మధ్యనే జగన్ గారిని ను కలిశా: నటి రాశి
ప్రస్తుతం తన సమయాన్నంతా సినిమాలకే కేటాయిస్తున్నానని సినీ నటి రాశి తెలిపింది. రాజకీయాలు తనకు సరిపోవని చెప్పింది. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ గారిని కూడా కలిశానని... అయితే తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని తెలిపింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ గురించి కూడా రాశి మాట్లాడింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ చాలా బిజీ అయిపోయారని చెప్పింది. పవన్ మనసు చాలా మంచిదని, అది మాత్రం ఇప్పటికీ మారలేదని తెలిపింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి ఈ వ్యాఖ్యలు చేసింది.