: ప్రతి పార్టీలో గొడవలు సహజం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్టీలో గొడవలు సహజమని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీలో ఉన్న చిన్న చిన్న విభేదాలు త్వరలో సర్దుకుంటాయని, టీఆర్ఎస్ లోనూ అంతర్గత గొడవలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, త్వరలో హైదరాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు వ్యతిరేకమని తెలిసి, ఎరువుల స్కీమ్ ను తెరపైకి తీసుకొచ్చారని, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి ఉందని మళ్లీ చెబుతున్నానని, వారికి చేతనైతే కేసులు పెట్టాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.