: యాష్కి! మరోసారి నోరు పారేసుకుంటే తెలంగాణలో తిరగవు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


కేటీఆర్, కవిత, హరీశ్ రావుకు ఈడీ నోటీసులు అందాయంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దొంగ వీసాలతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి మధు యాష్కి అని, టీఆర్ఎస్ స్కీమ్ ల పార్టీ .. కాంగ్రెస్ స్కామ్ ల పార్టీ అని అన్నారు. ‘కేడీ పనులు, ఈడీ కేసులు కాంగ్రెస్ చరిత్ర , అవినీతికి అడ్డా కాంగ్రెస్ పార్టీ .. పార్టీ అధికార ప్రతినిధి పదవి పోతుందని చెప్పి .. యాష్కి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గాంధీభవన్ పిచ్చాసుపత్రిలా మారింది’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News