: మోదీ హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి లేస్తాం: సీఎం పళనిస్వామికి తేల్చి చెప్పిన తమిళ రైతులు
రైతులను ఆదుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు గత 41 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు తాము ఇక్కడ నుంచి కదలమని వారు తెగేసి చెబుతున్నారు. రుణమాఫీ, కావేరి బోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధరపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. వైవిధ్యభరితంగా వారు చేపడుతున్న నిరసన కార్యక్రమం ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. దీక్షను విరమించాలని కోరారు. రైతు సమస్యలపై ప్రధానికి మెమొరాండం అందిస్తామని రైతులకు పళనిస్వామి తెలిపారు. అయితే, తమకు ప్రధాని మోదీ హామీ ఇస్తేనే ఆందోళ విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు.